అల్లుడితో ఎఫైర్.. కన్న కూతురిని హత్యచేసిన మహిళ

బీహార్‌లోని అరేరియాలో, అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న తల్లి తన కూతురిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కొత్తగా పెళ్లైన సజీదా పర్వీన్.. తన తల్లి షైస్తా పర్వీన్, అల్లుడు అబు నాసర్‌ల మధ్య ఎఫైర్ గురించి తెలుసుకుని వ్యతిరేకించింది. దీంతో తల్లి, అల్లుడు కలిసి ఆమెను హత్య చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు తల్లి, అల్లుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. వైద్య చికిత్స నెపంతో సజీదాను హత్య చేసి, మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చినట్లు ఆరోపణలున్నాయి.

సంబంధిత పోస్ట్