సాఫ్ట్‌వేర్ రంగం కంటే ఏఐ రంగంలో జీతాలు అధికంగా ఉన్నాయని, టెక్ ఉద్యోగులు ఏఐ వైపు మళ్లుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. స్కేలర్ AI వర్క్‌ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం, ఏఐ రంగంలోకి మారిన మహిళలు సగటున 145% అధిక జీతాలు పొందుతున్నారు. హెచ్‌ఆర్, విద్య, మార్కెటింగ్ వంటి రంగాల్లోనూ మహిళలు ఏఐ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. QA ఇంజనీర్ల జీతాలు 574% పెరిగాయి. టెక్నాలజీ నేపథ్యం లేనివారు కూడా ఏఐ నేర్చుకుంటున్నారు.