ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో వ్యభిచారం చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మఝోలా ప్రాంతంలోని బుద్ధి విహార్‌లోని సెక్టార్ 7లో ఒక విలాసవంతమైన భవనంలో సెక్స్ రాకెట్ నడుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు రైడ్స్ నిర్వహించగా.. ఇద్దరు మహిళలు, ఆరు మంది పురుషులను అరెస్టు చేశారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందులు, కండోమ్ ప్యాకెట్లు, రూ. 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.