AP: ఉమెన్స్ వరల్డ్ కప్ సాధించిన తర్వాత తొలిసారి సొంత గడ్డ కడపకు వస్తున్న శ్రీ చరణి రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో శ్రీ చరణిని సత్కారించనున్నారు. అలాగే నగరంలోని పోస్టాఫీసు నుంచి, సెవెన్ రోడ్స్, కోటిరెడ్డి సర్కిల్, ఎర్రముక్క పల్లె సర్కిల్ మీదుగా రాజీవ్ మార్గ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.