పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి (వీడియో)

AP: అనకాపల్లిలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా కూర్మన్నపాలెం వద్ద రోడ్డు పక్కన ఉన్న గెడ్డలో అదుపుతప్పి  కారు బోల్తా పడింది. ఈ ఘటనలో గాజువాకకు చెందిన మంగ అనే మహిళ స్పాట్‌లోనే మృతి చెందగా.. కుసుమ (46) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరో నలుగురు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దువ్వాడ పోలీసులు క్రేన్ సహాయంతో గెడ్డలో పడిపోయిన కారును బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్