రాబోయే బీహార్ ఎన్నికల్లో బురఖా ధరించిన ఓటర్లను తనిఖీ చేయాలని బీహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పోలింగ్ బూతుల్లో బురఖా ధరించిన మహిళలను ధ్రువీకరించాలని ఆయన ఎన్నికల కమిషనర్‌ను కోరారు. దీనిపై ఆర్జేడీ తీవ్రంగా స్పందిస్తూ, బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది. అయితే, బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా మాత్రం ఈ డిమాండ్‌ను సమర్థించారు.