AP: తిరుపతి జిల్లా నారాయణపురానికి చెందిన ఓ మహిళ (26)కు లక్ష్మీపురంలో నివసిస్తున్న ఆజిమ్‌తో పరిచయం ఏర్పడింది. ఆమెను శారీరకంగా లొంగదీసుకున్న ఆజిమ్.. బెదిరింపులకు పాల్పడేవాడు. దాంతో ఆ మహిళ ఆజిమ్‌ను దూరం పెట్టింది. తనను కలవకపోతే చంపేస్తానని బెదిరించడంతో మహిళ తన తల్లితో కలిసి ఆజిమ్ ఉన్న చోటుకు వెళ్లగా.. ఇద్దరిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లాడు. వెంటనే ఆ మహిళ తన భర్తకు లైవ్ లొకేషన్ షేర్ చేసింది. సినీ తరహాలో అలిపిరి సీఐ కారును చేజ్ చేసి పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆజిమ్.. కార్లు, బైక్‌లను ఢీకొట్టాడు.