హాకీ ఇండియా శుక్రవారం నుంచి మహిళల జూనియర్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తోంది. ఈ టోర్నమెంట్‌లో 30 జట్లు పాల్గొంటున్నాయి. ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన ఫార్మాట్‌లో పోటీలు జరగనున్నాయి. ప్రదర్శన ఆధారంగా జట్లను ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించారు. ఏపీ జట్టు డివిజన్ ‘ఏ’లో ఉండగా.. తెలంగాణ హాకీ జట్టు డివిజన్ ‘సీ’లో ఉంది. ఈ నెల 12తో చాంపియన్‌షిప్ ముగియనుంది.