బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఆమోదింపచేసుకోవడానికి ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగిసిన వెంటనే ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజ్యాంగ సవరణ బిల్లులు కావడంతో 2/3 వంతు మెజారిటీ కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. టీఎంసీ, డీఎంకే, శివసేన, ఎన్సీపీ, ఎస్పీ పార్టీల నుంచి మద్దతు కూడగట్టే పనిలో ఉంది. గతంలో సంఖ్యాబలం లేకపోవడంతో ఈ బిల్లులు ఆమోదం పొందలేదు.