చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించేందుకు నవరాత్రుల వేళ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. వర్షాకాల సమావేశాలు ఇంకా ప్రోరోగ్ కాకపోవడం దీనికి బలాన్నిస్తోంది. ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్డీఏ బలం పెరగడంతో, 2027 అసెంబ్లీ, 2029 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ఈ కీలక బిల్లును చట్టంగా మార్చాలని కేంద్రం వ్యూహం రచిస్తోంది.