కుటుంబం కోసం పురుషులు బయట కష్టపడితే.. గృహిణి ఇంట్లో అన్నీ తానై బాధ్యతలు మోస్తుంది. పొద్దున్నే లేచింది మొదలు వంట, ఇంటి పనులు, పిల్లల పెంపకం.. ఇలా విరామం లేకుండా కష్టపడుతుంటారు. మహిళల కష్టాలను చూపేలా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడిని భరిస్తూ.. ఇంటిని చక్కదిద్దే ఆమె త్యాగం వెలకట్టలేనిదని, కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించే ప్రతి మహిళా నిజమైన సూపర్ ఉమెనే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.