AP: నెల్లూరులో స్పా సెంటర్ల పేరుతో ఉమెన్ ట్రాఫికింగ్ సాగుతోంది. ఈ మేరకు నగరంలోని అనేక స్పా కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించగా, వ్యభిచారం చేస్తూ ఐదుగురు అమ్మాయిలు పట్టుబడ్డారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ఓ యువతిని సైతం ఇక్కడ వ్యభిచారానికి వినియోగిస్తున్న విషయం బయటపడింది. ఐదుగురు అమ్మాయిలతో పాటు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. పోలీసులు నగరంలో అక్రమ కార్యకలాపాలపై మరింత కఠినమైన నిఘా ఉంచారు.