ఘనంగా గోవుకి సీమంతం చేసిన మహిళలు

సాధారణంగా మహిళలకు సీమంతం చేస్తూ ఉండడం మనందరం చూసి ఉంటాం. కానీ జంతువులకు కూడా సీమంతం చేయడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారులోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గోమాతకు ఘనంగా సీమంతం చేశారు. కొందరు మహిళలు కడుపుతో ఉన్న ఆవుకు కొత్త వస్త్రాలను సమర్పించి, చెక్క శనగలు, కందులు, బెల్లం, ఉలవలు, పప్పు, గోధుమ పిండి, కూరగాయలు, పూలు, రకరకాల పండ్లు నైవేద్యంగా సమర్పించి సీమంతం వేడుకను కనుల విందుగా చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్