వర్క్‌ ఫ్రమ్‌ బైక్‌ వీడియో.. స్పందించిన సజ్జనార్‌ (వీడియో)

ప్రమాదకర స్థితిలో బైక్‌పై ల్యాప్‌టాప్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న యువకుడి వీడియోను హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 'ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ప్రాణాలను పణంగా పెట్టి ఇలా 'వర్క్ ఫ్రమ్ బైక్' చేయడం చూస్తుంటే 'ఆతృత ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుందనే మాట' అక్షరాలా నిజమనిపిస్తోంది. కడుపు నింపుకోవడానికి చేసే పని కడతేర్చేలా ఉండకూడదు. సురక్షితంగా ప్రయాణించి, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోండి' అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్