బీహార్‌లోని కతిహార్‌లో ఒక అంగన్‌వాడీ కార్యకర్త తాను ఆరోగ్యంగా లేను అని నిరూపించుకోవడానికి సెలైన్ ఎక్కించుకుంటూ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చింది. అధికారి ఆమె అనారోగ్యాన్ని సందేహించడంతో, భర్త సహాయంతో ఆమె వణుకుతూ కేంద్రానికి చేరుకుంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.