ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్

వరల్డ్ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ శనివారం తన కుటుంబంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నందుకు ప్రధాని అభినందనలు తెలిపారు. గుకేష్, అతని కుటుంబసభ్యులతో ప్రధాని ఆప్యాయంగా మాట్లాడారు.18 ఏళ్ల వయస్సులో 18వ ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా అవతరించిన గుకేష్‌కు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్