తల్లిదండ్రుల దినోత్సవాన్ని నిర్వహించాలన్న ప్రతిపాదన మొదటగా అమెరికాలో మొదలైంది. అయితే ఆ దేశ అధ్యక్షుడు బిల్ క్లింటన్ 1994లో యూఎస్ కాంగ్రెస్ చేసిన తీర్మానాన్ని చట్టంగా ఆమోదించారు. దీంతో ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం ఏర్పాటైంది. దక్షిణ కొరియాలో మే 8న ఈ రోజును జరుపుకుంటారు, కానీ ఐక్యరాజ్య సమితి జూన్ 1ను ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజున పలు దేశాల్లో తల్లిదండ్రుల ప్రేమ, త్యాగాన్ని స్మరిస్తూ వేడుకలు జరుపుతారు.