ప్రపంచ జనాభా 1987 జూలై 11న 5 బిలియన్లకు చేరడంతో "ఫైవ్ బిలియన్ డే"గా గుర్తించారు. దీనికి ప్రేరణగా తీసుకొని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) 1989లో జూలై 11ను "ప్రపంచ జనాభా దినోత్సవం"గా ప్రకటించింది. 1990లో 90కి పైగా దేశాల్లో మొదటిసారి ఈ దినోత్సవాన్ని జరుపుకున్నాయి. జనాభా పెరుగుదల, తగ్గుదలపై అవగాహన కల్పించడం, పర్యావరణ సంరక్షణను ప్రోత్సహించడమే దీని లక్ష్యం.