WPL 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఫైనల్ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని RCB 4 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలోనే ఛేదించింది. RCB బ్యాటర్లలో స్మృతి మంధాన(87) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడారు. జార్జియా వాల్(79) అర్థ సెంచరీతో రాణించారు. ఈ విజయంతో ఆర్సీబీ రెండోసారి డబ్ల్యూపీఎల్ విజేతగా నిలవడం విశేషం.