మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 4వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నారు. ఆర్సీబీ జట్టులో గ్రేస్ హారిస్, స్మృతి మంధాన, జార్జియా, రిచా ఘోష్, రాధా, క్లెర్క్, పూజా, అరుంధతీ, సయాలీ, శ్రేయాంక, లారెన్ బెల్ ఆడనున్నారు. ఢిల్లీ జట్టులో లిజెల్లె లీ, షెఫాలీ వర్మ, లారా, జెమీమా రోడ్రిగ్స్, కాప్, హెన్రీ, నికీ ప్రసాద్, స్నేహ రాణా, మిన్ను మణి, శ్రీచరణి, నందని ఉన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది.