TG: తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' రూపొందించిన ప్రముఖ రచయిత, కవి అందెశ్రీ కన్నుమూశారు. సోమవారం ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఇంట్లో ఒక్కసారిగా అందెశ్రీ కుప్పకూలి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు.