లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 138 పరుగులకు ఆలౌటైంది. 43/4తో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా.. 95 పరుగులు జోడించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. బెడింగ్‌హామ్(45), బావుమా(36), టాప్ స్కోరర్స్. పాట్ కమిన్స్ 6 వికెట్లు తీసి సఫారీల పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 212 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో ఆసీస్‌కు 74 పరుగుల ఆధిక్యం లభించింది.