ఏప్రిల్ 15న ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షావోమీ తన మొట్టమొదటి 'మినీ ఎల్‌ఈడీ' స్మార్ట్ టీవీ సిరీస్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. 'షావోమీ టీవీ ఎస్ మినీ ఎల్‌ఈడీ' సిరీస్‌లో 4K స్పష్టత, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, హెచ్‌డీఆర్ 10 ప్లస్, డాల్బీ అట్మాస్ సౌండ్, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రాథమికంగా 55, 65 అంగుళాల మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉంది.