హత్యాయత్నం కేసులో 15 మందికి రిమాండ్

బీబీనగర్ మండలం జియాపల్లితండాలో పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 15 మందిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఇటీవల జరిగిన సర్పంచి ఎన్నికల్లో ఓడిపోయిన, గెలిచిన వర్గాల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. డిసెంబరు 29న సర్పంచి విందు అనంతరం ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి, రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. రిమాండుకు తరలించిన వారిలో సర్పంచి గోవింద్నాయక్ తో పాటు పలువురి పేర్లు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్