స్థావరం మార్చుకుంటున్న పెద్దపులి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాజపేట, భువనగిరి మండలాల్లో పన్నెండు రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి తన స్థావరాన్ని మార్చుకుంది. ట్రాప్ కెమెరాల ద్వారా అధికారులు పులి సంచార ప్రాంతాలను గుర్తించారు. పులి ఆవును తింటున్న దృశ్యాలు కెమెరాలో నమోదయ్యాయి. పులిని పట్టుకునేందుకు రెండు బోనులు ఏర్పాటు చేసినప్పటికీ, అది దట్టమైన అడవులున్న కొండాపురం, శ్రీనివాసపురం, తిర్మలాపురం ప్రాంతాలకు వెళ్లింది. గురువారం తిర్మలాపురం సమీపంలో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించి అటవీ శాఖకు సమాచారం అందించారు. అధికారులు పులి అడుగులను పరిశీలించి నిర్ధారించారు. ఈ ప్రాంతంలో జింకలు, దుప్పులు వంటి జంతువులు ఉండటంతో పులి ఇక్కడే తిష్ఠ వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్