ఆలేరు: రోడ్డు ప్రమాదంలో ఐటీఐ అధికారి దుర్మరణం!

భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ ఫ్లైఓవర్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐటీఐ అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారి సుంకరి శ్రీనాథ్ (38) అక్కడికక్కడే మృతి చెందారు. జనగామకు చెందిన ఆయన ఆలేరులోనే నివాసముంటున్నారు. శ్రీనాథ్ బైక్‌పై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం బలంగా ఢీకొట్టిందని ఎస్ఐ వినయ్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్