భువనగిరి: పాడిరైతు నిర్లక్ష్యంతో ప్రయాణికుడికి ప్రమాదం

ఓ పాడిరైతు నిర్లక్ష్యంతో ప్రయాణికుడికి గాయాలైన ఘటన ఆదివారం యాదాద్రి జిల్లాలో జరిగింది. వలిగొండ మండలం ఎదుల్లగూడెంకి చెందిన ఓ వ్యక్తి భువనగిరి - చిట్యాల ప్రధాన రహదారిపై భువనగిరి వైపు వస్తుండగా అనాజిపురం వద్ద పాడిపశువులు ఒక్కసారిగా అడ్డురావడంతో ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలయ్యాయి. పాడి రైతులు పశువులను రోడ్లపైకి రానివ్వకుండా ఉన్న నిబంధనలను పాటించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్