యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం వెండి జోడు సేవ అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి అలంకారమూర్తులను నూతన వస్త్రాలు, పుష్పాలతో అలంకరించి, మంగళవాయిద్యాల నడుమ మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు మంగళహారతులు పడుతూ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల జయజయధ్వానాలు, వేదమంత్రోచ్ఛరణలతో భక్తిభావం వెల్లివిరిసింది.