భువనగిరి రూరల్ ఎస్సై అనిల్ మన్నెవారిపంపు వద్ద తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామల సత్తిరెడ్డి తన ఇంటిలో కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు బయటపడింది. ఘటనా స్థలంలో 80 లీటర్ల కల్తీ పాలు, 5 కిలోల ధోల్పూర్ ఫ్రెష్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు, 500 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 400 మిల్లీలీటర్ల ఎసిటిక్ యాసిడ్ స్వాధీనం చేసుకున్నారు. సత్తిరెడ్డిపై కేసు నమోదు చేశారు.