యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని దివ్యాంగుల పునరావాస కేంద్రానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) సహకారంతో, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) సౌజన్యంతో ప్రత్యేకంగా అందించిన ఆటో వాహనాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రారంభించారు. దివ్యాంగులకు మెరుగైన సేవలు అందించడంలో, వారి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడంలో ఈ ఆటో వాహనం కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (DRDO) మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.