గాంధీ గ్లోబల్ సంస్థల ఆధ్వర్యంలో ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్ర సహకారంతో శనివారం ఆరోగ్య సూత్రాలపై అవగాహన సదస్సును నేడు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో నిర్వహించారు. ప్రజలు అందరూ వచ్చి తమ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకొని వాటి మార్గాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెరుగు మధు, మాటూరి అశోక్, కొత్త బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.