ఎన్నికల కమీషన్ తీసుకుంటున్న ఎలక్టోరల్ రిఫార్మ్స్‌పై ఈ నెల 9, 10వ తేదీల్లో పార్లమెంట్‌లో 10 గంటలు చర్చ చేపడతామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే దీనిపై చర్చిస్తే.. ఇప్పుడు విపక్షాలు ఆందోళన చేసేవి కావని తెలిపారు. అలాగే కేంద్రం తీసుకొవచ్చిన సంచార్ యాప్ విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల మనల్ని ట్రాక్ చేసే అవకాశం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.