యాదగిరిగుట్టలో ఏకాదశి లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఆలయ ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, బంగారు, వజ్ర వైఢూర్యాలతో అలంకరించి, ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. సుగంధ పరిమళ పుష్పాలతో లక్ష పుష్పార్చన చేపట్టారు. పాంచరాత్రాగమానుసారంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్