దత్తాయపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన

ఆలేరు నియోజకవర్గం పరిధిలోని తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ జేరుపోతుల కరుణాకర్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సహకారంతో గ్రామంలో మౌలిక వసతులు మెరుగుపరిచి, అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జిట్ట బాలకృష్ణ, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్