యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని యాదాద్రీశుడి సన్నిధిలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం ఉదయం నాగవల్లి దళార్చనలు శాస్త్రోక్తంగా జరిగాయి. కొండపైన విష్ణుపుష్కరిణి వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకులు పంచసూక్తాలు, మన్యు సూక్త పఠనాలతో అభిషేకించి, సింధూరం, వివిధ రకాల పూలతో అలంకరించి ఆకు పూజ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.