ఆలేరు మండలం కంది గడ్డతండాకు చెందిన గిరిజన రైతు తేజావత్ హేమ్లానాయక్ శనివారం వ్యవసాయ బావివద్ద వరికోత యంత్రంతో పనిచేస్తుండగా, హైడ్రాలిక్ ట్రాలీ 11కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. భార్య భూళీ చూస్తుండగానే ఈ విషాదం చోటుచేసుకుంది. ఆలేరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ట్రాలీని పైకి లేపినప్పుడు విద్యుత్ తీగలు తగలడంతో ట్రాక్టర్కు విద్యుత్తు ప్రసారం జరిగి హేమ్లానాయక్ మృతి చెందాడు. రెవెన్యూ అధికారులు వివరాలు నమోదు చేసుకున్నారు.