మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ.. వృథాగా పోతున్న తాగునీరు

యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీతో తాగునీరు వృథాగా పోతోంది. ఎంపీడీవో కార్యాలయం నుంచి యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై నీరు నిలిచి వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, నీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శి, ఎంపీవో, ప్రత్యేక అధికారి స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕