యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి, ముల్కలపల్లి గ్రామాల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. తుల పంటలకు న్యాయమైన ధరలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు.