యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గం, తుర్కపల్లి మండలంలోని చిన్న లక్ష్మాపూర్ గ్రామంలో శనివారం శ్రీ కార్తీకేయ ప్రాజెక్ట్స్, డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కాకి గంగాధర్ గౌడ్ తన తల్లిదండ్రులు కాకి జయప్రద-లక్ష్మయ్య గౌడ్ జ్ఞాపకార్థం చిన్న లక్ష్మాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కోమటిరెడ్డి సంతోష భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ మూడవత్ పార్వతీ చిన్న నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ హాజరయ్యారు. కార్తికేయ ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో ఈ నోట్ బుక్స్ అందజేయబడ్డాయి.