రాజపేట: జూనియర్లపై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ తీవ్రమైంది. వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న పదవ తరగతి విద్యార్థి ముస్తాల కౌశిక్ వర్ధన్ పై 20 మంది ఇంటర్ విద్యార్థులు అర్ధరాత్రి దాడి చేసి గాయపరిచారు. అడ్డు వచ్చిన మరో ఐదుగురిని కూడా కర్రలు, బ్యాట్లతో కొట్టారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్, సిబ్బంది సమస్యను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినా విఫలమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్