యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పదో తరగతి విద్యార్థి ముస్త్యాల కౌశిక్ పై తోటి ఇంటర్ విద్యార్థులు క్రికెట్ బ్యాట్, స్టంప్ లతో దాడి చేశారు. చదువులో చురుగ్గా ఉండి, వసతిగృహ గదికి వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కౌశిక్ ను, తమకంటే చిన్నవాడై తమను కట్టుదిట్టం చేస్తున్నాడనే కారణంతో గత నెల 29న రాత్రి దాడి చేసినట్లు తెలిసింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను గుర్తు తెలియని విద్యార్థి ఫోన్ లో తీసినట్లు సమాచారం.