గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు శ్రమదానం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోట బావి తండ గిరిజన గ్రామ పంచాయతీలో శనివారం సర్పంచ్ కెతావత్ నరేందర్ నాయక్, ఉప సర్పంచ్ మెగావత్ హన్మంతు నాయక్, వార్డు సభ్యులతో కలిసి శ్రమదానం నిర్వహించారు. ప్రతి గ్రామపంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోగా, అందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రీకారం చుట్టారని, గ్రామ ప్రజలందరూ అందులో భాగస్వాములై గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సర్పంచ్ కెతావత్ నరేందర్ నాయక్ అన్నారు. గ్రామంలో ఉన్న మంచినీటి పైప్ లీకేజ్ పనులను సోమవారం పరిశీలించనున్నట్లు తెలిపారు. గ్రామ శ్రమదానం ద్వారా శుభ్రం చేసిన వీధుల్లో, ఖాళీ స్థలాల్లో ఎలాంటి చెత్తాచెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

సంబంధిత పోస్ట్