యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గం పరిధిలోని తుర్కపల్లి మండలం వెంకటాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలకు బుధవారం 3వ వార్డ్ సభ్యురాలు రాగుల మహేశ్వరీ మల్లేష్, జంగా విజయ్ స్మార్ట్ టీవీని బహుకరించారు. ఈ బహుకరణ ద్వారా విద్యార్థులు ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుందని, వారి సేవాభావం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.