యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి గ్రామపంచాయతీ సఫాయీ కార్మికులకు గురువారం ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారి డా. రుచిరారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో కార్మికులకు వివిధ వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ సత్యనారాయణ, హెచ్వీ దయామణి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.