యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి 93వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 9 గంటలకు శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ చైర్మన్ సుర్వి యాదమ్మ - యాదయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ చిలకరాజు చందన రాజు గార్ల దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై దేవతల అనుగ్రహం ఉండాలని, సేవా కార్యక్రమాల్లో దేవుని ఆశీస్సులతో అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం, మాజీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.