యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో పలువురికి మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కల్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఆయన తెలిపారు.