తుర్కపల్లి సాక్షి రిపోర్టర్ దుద్యాల రవికుమార్ గుండెపోటుతో మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గం పరిధిలోని తుర్కపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. సాక్షి దినపత్రిక తుర్కపల్లి మండల రిపోర్టర్ దుద్యాల రవికుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా మంగళవారం మృతి చెందారు. ఆయన మరణవార్త విని పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఆకస్మిక మరణం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్