యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. కొండకింద కళ్యాణకట్ట, వ్రత మండపం, కొండపైన ఆలయ పరిసరాలు, తిరువీధులు భక్తులతో సందడిగా మారాయి. గర్భాలయంలోని లక్ష్మీనరసింహుని దర్శనానికి భక్తులు ఉదయం నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. ఆర్జిత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్