యాదగిరిగుట్ట: క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీనితో క్యూలైన్లు బారులు తీరాయి. ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్