యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి బుధవారం రూ. 12,52,249 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు. ప్రసాద విక్రయాల ద్వారా రూ. 5,66,630, కార్ పార్కింగ్ ద్వారా రూ. 1,67,000, విఐపి దర్శనాల ద్వారా రూ. 1,05,000, బ్రేక్ దర్శనాల ద్వారా రూ. 98,700, ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 76,700, వ్రతాల ద్వారా రూ. 47,000, తదితర విభాగాల నుంచి ఈ ఆదాయం వచ్చినట్లు తెలిపారు.